ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం

ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం
- ఎమ్మెల్యే వేముల
భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : భీంగల్ మున్సిపల్ రెండో విడుత సాధారణ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం మీడియా కు ప్రకటన విడుదల చేశారు. బీఆర్ఎస్ పార్టీ కి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసిన పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ విజయం కొరకు కష్టపడ్డ ప్రతి నాయకుడు, కార్యకర్తలకు ధన్యవాదములు తెలిపారు. గెలుపునకు పొంగి పోకుండా, ఓటమికి కుంగి పోకుండా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవవిస్తున్నామని అన్నారు.
ఓటమి చెందినప్పటికి ప్రజల పక్షాన నిలబడి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటామని పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధి కోసం ఎప్పటికి ప్రజలతో కలిసి పని చేస్తూ సమస్యల పరిష్కారం కొరకు పార్టీ కృషి చేయడం జరుగుతుందని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల విశ్వాసం నిల బెట్టుకుని పారదర్శకంగా పని చేస్తారని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
