ఎల్లమ్మ పట్నాల్లో పూజలు చేసిన ఎమ్మెల్యే

ఎల్లమ్మ పట్నాల్లో పూజలు చేసిన ఎమ్మెల్యే
జన్నారంరూరల్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కలమడుగు గ్రామంలో ఎల్లమ్మ పట్నాలు, బోనాలల్లో నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు,ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా ఉండాలని ఆ ఎల్లమ్మ తల్లిని కోరుకున్నానన్నారు.
గ్రామాల్లోని ప్రజలంతా ఏకమై గ్రామ దేవతలను ఎంతో భక్తిశ్రద్ధలతో పూజించుకుంటారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో జన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, ఆ గ్రామ సర్పంచి బొంతల నాగమణి – మల్లేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముజాఫర్, నేతలు సయ్యద్ ఇసాక్, జక్కు భూమేష్, ముత్యం సతీష్, అల్లం రవి, గట్టు మల్లేష్, సాగర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
