MLA | సంప్రదాయ సంబురాలు అభినందనీయం

పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా

MLA | కృష్ణా ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఎంతో కాలం నుంచి ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయ పండుగలను కొనసాగించడం అభినందనీయమని నిర్వాహకులను పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అభినందించారు. తోట్లవల్లూరు మండలం చాగంటిపాడు శివారు పిల్లవాని లంకలో కుంతీదేవి సంబరాలలో ఎమ్మెల్యే పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనను ఘనంగా సత్కరించారు. గ్రామస్తులంతా కలిసికట్టుగా కుంతిదేవి సంబరాలను నిర్వహించుకోవడం ఎంతో కాలం నుంచి జరుగుతుందని తెలిపారు.

ఈ సంబరాల్లో తాను పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు అందరికీ మెండుగా ఉండాలని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతగానో శ్రమిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నడూ లేని విధంగా రహదారుల అభివృద్ధి చేసి పల్లె సీమలను అభివృద్ధి పదం వైపు నడిపిన కూటమి ప్రభుత్వానికి ప్రజా మద్దతు పూర్తిగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply