Mla Shankar | కాలనీల అభివృద్ధికి చర్యలు

Mla Shankar | కాలనీల అభివృద్ధికి చర్యలు
ఎమ్మెల్యే గోండు శంకర్
Mla Shankar | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : అరసవెల్లి ఆదిత్య నగర్ కాలనీ, లక్ష్మీ నగర్, శ్రీ లక్ష్మీ నగర్, అసిరి తల్లి గుడి ఎదురు రోడ్డు, టైగర్ ప్రాంతాల్లో ఎమ్మెల్యే శంకర్ (Mla Shankar) ఇవాళ పర్యటించారు. కాలువలు, రోడ్లు, నీటి సమస్యలు నివారణ, వీధిలైట్లు ఏర్పాటు కోసం, రిజర్వ్ స్థలాలకు ప్రహరీ గోడల నిర్మాణం వంటి అనేక అంశాలపై క్షుణ్ణంగా పరిశీలించారు. మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులకు ప్రతిపాదన సిద్ధం చేయాలని, పనులు ప్రారంభించి త్వరగా పూర్తి చేయాలని కోరారు. కూటమి నాయకులు, మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
