ఘనంగా రాములోరి కళ్యాణ మహోత్సవం….

ఘనంగా రాములోరి కళ్యాణ మహోత్సవం….

స్వామివారిని దర్శించుకున్న మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి

మేడ్చల్, ఆంధ్రప్రభ : సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ గుండ్లపోచంపల్లి డివిజన్ లోని శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా సీతారామచంద్రస్వామి ఆలయంలో మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని సీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు.. సీతారాముల కల్యాణోత్సవ పూజా కార్యక్రమాలు ప్రధాన అర్చకులు ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు.
గుండ్ల పోచంపల్లి డివిజన్ నుండి భక్తులు వారి గృహాల నుండి స్వామి వారి కళ్యాణం కోసం తలంబ్రాలు తీసుకురావడం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవ వేడుకల్లో ముద్దుల శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ బేరి బాలరాజు , ప్రముఖులు, భక్తులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply