MLA Kadiyam Srihari | గ్రామ రూపురేఖలను మార్చి చూపిస్తా..

MLA Kadiyam Srihari | గ్రామ రూపురేఖలను మార్చి చూపిస్తా..

  • నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేయించిన తహసీల్దార్
  • నూతన సర్పంచ్ జూలుకుంట్ల శిరీష్ రెడ్డి

MLA Kadiyam Srihari | స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్ర‌ప్ర‌భ : వచ్చే ఐదేళ్లలో గ్రామాభివృద్ధిని ప్రాధాన్యంగా తీసుకుని, ఎమ్మెల్యే కడియం శ్రీహరి కృషితో రంగారాయిగూడెం గ్రామ రూపురేఖలను పూర్తిగా మార్చి చూపిస్తానని నూతన సర్పంచ్ జూలుకుంట్ల శిరీష్ రెడ్డి తెలిపారు. సోమవారం స్టేషన్ ఘన్‌పూర్ మండలం రంగారాయి గూడెం గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి తహసీల్దార్ వెంకటేశ్వర్లు హాజరై నూతన పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈసందర్భంగా నూతన సర్పంచ్ మాట్లాడుతూ… గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని ఎప్పటికీ వృథా చేయబోనని స్పష్టం చేశారు. గ్రామ అభివృద్ధి ప్రతి అంశంలో తన వంతు బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తి స్తానని, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ జూలుకుంట్ల లావణ్య శిరీష్ రెడ్డి, సెక్రటరీ షేక్ ఇర్ఫాన్, కాంగ్రెస్ నాయకులు తోట వెంకన్న, నెలమంచ అజయ్ రెడ్డి, చట్ల సురేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply