MLA | సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు….

MLA | సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు….

MLA | భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, ఐక్యత, సౌభాగ్యం తీసుకురావాలని ఆకాంక్షించారు.

రైతుల పండుగగా ప్రసిద్ధి చెందిన ఈ సంక్రాంతి వ్యవసాయ రంగానికి మరింత బలం చేకూర్చాలని, రైతులు సుఖసంతోషాలతో ఉండాలని ఆయన కోరుకున్నారు. గ్రామీణ సంప్రదాయాలు, కుటుంబ బంధాలను మరింత బలపరిచే ఈ పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలని, కొత్త సంవత్సరంలో జిల్లా ప్రజలందరికీ మంచి ఆరోగ్యం, శాంతి, సమృద్ధి కలగాలని వేముల ప్రశాంత్ రెడ్డి ఆకాంక్షించారు.

Leave a Reply