సీతారాముల కళ్యాణం…పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే

సీతారాముల కళ్యాణం…పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే
కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మాజీ స్పీకర్, మధుసూదన చారి,బీజేపీ అధికార ప్రతినిధి కీర్తిరెడ్డి
రేగొండ, ఆంధ్రప్రభ : రేగొండ మండలం రూపిరెడ్డి పల్లి,రావులపల్లి,రంగయ్య పల్లి,రామాలయలలో శుక్రవారం ఉదయం 11:25 లకు ఆలయకమిటీ ఆధ్వర్యంలో సీతా రాముల కల్యాణం శాసో్త్రక్తంగా కన్నులపండువగా వైభవంగా జరిగింది. కోదండ రాముడి కళ్యాణ వేడుకలు వేద పండితుల మంత్రోత్సహారజాల నడప నిర్వహించారు.అత్యధిక సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొని స్వామివారి కల్యాణాన్ని తిలకించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు.
సీతారాముల కళ్యాణం మహోత్సవాన్ని తిలకించేందుకు మాజీ స్పీకర్ ప్రస్తుత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, బిజెపి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి, హాజరై కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. దశావతారాల్లోని ఏడోవతారంగా శ్రీరాముడు జన్మించాడని, మానవ రూపంలో పుడమిపై అవతరించి ధర్మసంస్థాపన చేశాడని, శ్రీరాముడు వసంతరుతువులో చైత్రశుద్ధ నవమి రోజున త్రేతాయుగంలో జన్మించాడని, రాముడు పుట్టిన రోజు వేడుక, పట్టాభిషిక్తుడైన వేడుక ఒకే రోజున కావడంతో జన్మోత్సవం, కళ్యాణోత్సవం వేడుకలు నిర్వహిస్తారని తెలిపారు.
లోకంలో ఎవరికీ లేని 16 సుగుణాలన్నీ ఒక్క శ్రీరాముడికే ఉన్నాయని, ధర్మానికి ప్రతిరూపుడని, ఆయన పాలన రామరాజ్యంగా ప్రజ్వరిల్లిందని పేర్కొన్నారు. గుణవంతుడు, విద్యావంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యభాషి, ఒధృఢ, నిష్ట, సదాచార, సర్వభూతహిత, విద్వాంసుడు, సమర్థుడు, ప్రియదర్శనుడు, మనోనిగ్రహం కలవాడు, అసూయ, క్రోధలేనివాడు,రణభయంకరుడు,కాంతిమంతుడు అందుకే రాముడ్ని సకల గుణ సంపన్నుడిగా అభివర్ణిస్తారని వారు కొనియాడారు.
వైభవంగా జరిగిన కోదండరాముడి కళ్యాణ వేడుకను కన్నులారా చూసేందుకు రేగొండ మండల ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు భక్తులకు అన్నదానం చేశారు.ఆలయ చైర్మన్ ముడుతనపల్లి శంకరయ్య, స్థానిక సర్పంచ్. ముడుతనపల్లి కుమారస్వామి, మాజీ సర్పంచ్. బండారి కవిత -దేవేందర్, మాజీ ఎంపీటీసీ ఐలి శ్రీధర్, గ్రామస్తులు. శ్రీధర్,శంకర్,అశోక్,సురేందర్, తదితరులు పాల్గొన్నారు.
