బీఆర్ఎస్ పార్టీ నాయకుడి మృతి విచారకరం…

బీఆర్ఎస్ పార్టీ నాయకుడి మృతి విచారకరం…
మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి…
ఊట్కూర్, ఆంధ్రప్రభ : బీఆర్ ఎస్ సీనియర్ నాయకుడు బిజ్వార్ ఉపాధ్యక్షుడు గుయ్యల వెంకటరెడ్డి మృతికి పార్టీకి తీరనిలోటని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మంగళవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని బిజ్వార్ గ్రామ వి ఆర్ ఎస్ ఉపాధ్యక్షుడు వెంకట్ రెడ్డి మృతి చెందడంతో ఆయన పార్తివదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకట్ రెడ్డి పార్టీ చేపడుతున్న వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారని విచారం వ్యక్తం చేశారు.
మృతి చెందిన వెంకట్ రెడ్డి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటానని హామీఇచ్చారు. సీనియర్ నాయకుడు వెంకట్ రెడ్డి ఆశయ సాధనకు పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి అరవింద్ కుమార్, నాయకులు వెంకటేష్ గౌడ్ శివారెడ్డి జుట్ల సాగర్ తదితరులు పాల్గొన్నారు.
