చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్

ఉట్నూర్, ఆంధ్రప్రభ ; ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని గంగన్నపేట్ లో కొత్తపల్లి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నూతన చలివేంద్రాన్ని గురువారం నిర్మల్ డిసిసి అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ నాయకులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవి లో ఎండ తీవ్రతకు ప్రజలు ఇబ్బంది పడతారని, స్వచ్ఛందంగా చలి వేంద్ర0 ఏర్పాటు చేసి వేసవిలో ప్రజలకు సేవ చేయడం సమాజంలో హర్షణీయం అన్నారు. ప్రతి ఏడాది వేసవిలో కొత్త పెళ్లి వెల్ఫేర్ సొసైటీ పేరిట చలివేంద్రం ఏర్పాటు చేయడం హర్ష నీయమన్నారు.

ఈ కార్యక్రమంలో సొసైటీ వ్యవస్థాపకులు కొత్తపల్లి మహేందర్,కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు లింగంపల్లి చంద్రయ్య , ఆర్టీఏ మెంబర్ దూట రాజేశ్వర్, కాంగ్రెస్ మహిళా నాయకురాలు మెస్రం భాగ్యలక్ష్మి,సామాజిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply