MLA | జర్నలిస్టు కుటుంబానికి పరామర్శ

MLA | హనుమాన్ జంక్షన్, ఆంధ్రప్రభ : ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన జ‌ర్న‌లిస్టు కనకవల్లి దాస్(Kanakavalli Das) కుటుంబ సభ్యులను గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పరామర్శించారు. ఆదివారం మధ్యాహ్నం ఎమ్మెల్యే వేలేరు గ్రామం దాస్ ఇంటికి వెళ్లారు. దాస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మృతుని కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని భరోసా(Reassurance) ఇచ్చారు. కార్యక్రమంలో వేలేరు పీఏసీఎస్ అధ్యక్షుడు అవిర్నెని భవాని శంకర్, కాకులపాడు డీసీ చైర్మన్ కొమ్మారెడ్డి రాజేష్, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు అట్లూరి రాజశేఖర్, మలిశెట్టి సుబ్రహ్మణ్యం, కాంతారావు, టీడీపీ నాయకులు చలసాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply