MLA | సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్

MLA | సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్
- ఎమ్మెల్యే మండలం బుద్ధ ప్రసాద్
MLA | ఘంటసాల, ఆంధ్రప్రభ : ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ కార్యక్రమాన్నినిర్వహిస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలం బుద్ధ ప్రసాద్ తెలిపారు. ఈ రోజు ఉదయం ఘంటసాల మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఎమ్మెల్యే అర్జీలు స్వీకరించారు.
ఘంటసాల గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ జనసేన నాయకులు యార్ల శ్రీకాంత్ వినతిపత్రం అందజేశారు. ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని తెలుగురావుపాలెం సర్పంచ్ రాచూరి ప్రసాద్ బాబు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు.
మండల వ్యాప్తంగా ఉన్న పలువురు ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని ఆయన దృష్టికి తీసుకురాగా, మండల స్థాయి అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణమే కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి సుబ్బారావు, తహసీల్దార్ విజయప్రసాద్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
