MLA | నెల రోజుల్లోనే రూ.కోటి నిధులు

MLA | నెల రోజుల్లోనే రూ.కోటి నిధులు

  • గ్రామస్తుల హృదయాల్లో చెరగని ముద్ర వేయాలి
  • చరిత్ర కలిగిన ఈ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయడమే నా కోరిక
  • ఇప్పగూడెంలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం
  • నూతన సర్పంచ్ రాణికి ఘనంగా సన్మానం
  • ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి

MLA | స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్ర‌ప్ర‌భ‌ : నూతన పాలకవర్గం గ్రామాభివృద్ధి కోసం పనులను ఎంపిక చేసుకొని రండి..నెల రోజుల్లో కోటి రూపాయల నిధులు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఈ సందర్భంగా ప్రకటించారు. ఇవాళ‌ స్టేషన్ ఘన్‌పూర్ మండలం ఇప్పగూడెం గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డుసభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ముందుగా నూతన పాలకవర్గంతో స్పెషల్ ఆఫీసర్ ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ… నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. గ్రామ ప్రజల సమస్యలను తెలుసుకొని, సాధ్యమైనంత వరకు గ్రామ పంచాయతీ స్థాయిలోనే పరిష్కరించాలన్నారు. అవసరమైతే తన దృష్టికి తీసుకువస్తే తానే పరిష్కారం చేయిస్తానని భరోసా ఇచ్చారు. మీరు అదృష్టవంతులని, మీకు తోడుగా ఎమ్మెల్యే, ఎంపీతో పాటు ప్రభుత్వం కూడా ఉందని పేర్కొన్నారు.

MLA

ఇప్పగూడెంను ప్రగతి పథంలో తీర్చిదిద్దుతా…

బ్రాహ్మాండంగా ఐదేళ్ల పాటు సర్పంచ్‌గా కొనసాగుతారని పేర్కొంటూ… తన పూర్తి సహకారం ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. గ్రామా న్ని ప్రగతి పథంలో తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే అన్నారు. గ్రామ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసేలా పాలన సాగించాలని సూచించారు. అమలు కాని హామీలు ఇవ్వకుండా, చేయగలిగిన పనులనే ప్రజలకు చెప్పాలని, చెప్పిన మాటను తప్పకుండా నెరవేర్చాలని స్పష్టం చేశారు.

ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి గ్రామ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ ఉందని, ఈ గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలన్నదే తన కోరిక అని తెలిపారు. ఇప్పటివరకు గ్రామంలో 53 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, మార్చి నెలలో మరో 50ఇళ్లు ఇస్తామని వెల్లడించారు. ఆలాగే రెండేళ్ల లోపు 3 నుంచి 4 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో అందరూ కలిసి అభివృద్ధి కోసం పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. అనంతరం నూతన సర్పంచ్ మందపురం రాణి అనిల్ దంపతులను ఎమ్మెల్యే శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జూలుకుంట్ల శిరీష్ రెడ్డి, నాయకులు తోట వెంకన్న, నెలమంచ అజయ్ రెడ్డి, ఎల్లగౌడ్, చట్ల సురేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply