స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయాలకై….

స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయాలకై….

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు…

పాయకాపురం, ఆంధ్రప్రభ : టీడీపీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయాలకై పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు పాటుపడుతున్నారని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని అన్నీ డివిజన్లలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని పలు చోట్ల స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాలను, పార్టీ దిమ్మలను ఆవిష్కరించారు.

స్థానిక64వ డివిజన్ రాధా నగర్ ప్రాంతంలో డివిజన్ అధ్యక్షుడు కె. రవికుమార్, వరలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని డివిజన్ అధ్యక్షుడు రవికుమార్తో కలసి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవాడికి కూడు, గుడ్డ, గూడు అనే నినాదంతో టీడీపీని స్థాపించడం జరిగిందని తెలిపారు.

ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పాటుపడుతున్నారని అన్నారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలలో ఉంటూ వారి సమస్యలను తీరుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎస్ కె. బాబు, కోమరి రాజేష్, బాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply