ఇల్లు దగ్దం.. కుటుంబానికి స‌హాయం…

ఇల్లు దగ్దం.. కుటుంబానికి స‌హాయం…

66వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కిరణ్

హసన్ పర్తి, ఆంధ్రప్రభ : హన్మకొండ జిల్లా హసన్ పర్తి 66వడివిజన్ లో విద్యుత్ షాట్ సర్క్యూట్ తో ఎలుక రాజు వెంకటేశ్యర్ ఇల్లు దగ్దమైంది. ఈమాచారంతో శనివారం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆదేశాల మేరకు 66వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు కనపర్తి కిరణ్ దగ్ధమైన ఇంటిని సందర్శించి పరిశీలించారు. వెంకటేశ్వర్ కుటుంబ సభ్యులను పరామర్శించి.. మనోధైర్యాన్ని కల్పించారు.

ఈమేరకు ఎమ్మెల్యే సహకారంతో.. నిరాశ్రయులైన వెంకటేశ్వర్ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా అన్ని విధాల ఆదుకుంటామని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా తప్పకుండా వెంకటేశ్వర్లు కుటుంబానికి పక్కా ఇల్లు మంజూరు చేపిస్తామని హామీ ఇచ్చారు. అలాగే మండల ఆర్ఐ పాజిల్, అశోక్ జిపిఓ మనెమ్మ ఇల్లు దగ్దమైన సంఘటనపై వివరాలు సేకరించారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వీసం సురేందర్ రెడ్డి, స్థానికులు పాల్గొన్నారు.

Leave a Reply