కూటమి ప్రభుత్వంలో పేదల సంక్షేమానికి ప్రాముఖ్యత

కూటమి ప్రభుత్వంలో పేదల సంక్షేమానికి ప్రాముఖ్యత
అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
మోదుమూడిలో పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
అవనిగడ్డ, ఆంధ్రప్రభ : కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాముఖ్యత ఇస్తుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శనివారం ఉదయం అవనిగడ్డ మండలం మోదుమూడిలో ఎమ్మెల్యే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందించారు. ఒకటో తేదీ ఆదివారం వచ్చే ప్రతి నెలా ప్రభుత్వం ఒకరోజు ముందుగానే పింఛన్లు సొమ్ము పంపిణీ చేయిస్తోందని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు, సర్పంచ్ బచ్చు బేబీ, డీసీ వైస్ చైర్మన్ బచ్చు రఘునాథ ప్రసాద్, జనసేన సీనియర్ నాయకులు బచ్చు వెంకట్ నాధ్ ప్రసాద్, గ్రామ ప్రముఖులు బచ్చు వెంకట నారాయణ, కూటమి నాయకులు బచ్చు శ్రీహరి, బచ్చు మల్లి, గ్రామ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

