mla| పాటల సిడిని ఆవిష్కరించిన ఎమ్మెల్యే, కలెక్టరు, తదితరులు

mla| పాటల సిడిని ఆవిష్కరించిన ఎమ్మెల్యే, కలెక్టరు, తదితరులు

బంజారా రచయిత బంకట్ లాల్ రూపొందించిన సిడి క్యాసెట్ ఆవిష్కరణ
సాహిత్య రచనల్లో రాణించాలి; ఎమ్మెల్యే, కలెక్టర్ వక్తలు

mla| ఉట్నూర్ ,ఆంధ్రప్రభః బంజారా కళాకారుడు రచయిత జాదవ్ బంకట్ లాల్ బంజారా ఆరాధ్య దైవం శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ పై రూపొందించిన పాట సిడిని బుధవారం ఆదిలాబాద్ లోని రాంలీల మైదానంలో జరిగిన సంత్ సేవలాల్ జయంతి వేడుక వేదికపై బొత్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పి అఖిల్ మహాజన్, ఉట్నూర్ ఐటీడీఏ పీవో యువరాజు మర్మాట్ వక్తల సమక్షంలో పాట సిడిని విడుదల చేశారని సిడి రూపకర్త బంకట్లాల్ తెలిపారు.

ఈ సందర్భంగా తాను సిటీ రూపొందించినందుకు వక్తలు ప్రశంసించారని జాతి సమాజం కోసం సేవాలాల్ మహారాజ్ చేసిన కార్యక్రమాలపై పాటను రూపొందించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ సి డి ఆవిష్కరణలో అదిలాబాద్ మాజీ జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, అదిలాబాద్ ,బొత్ మాజీ ఎమ్మెల్యే లు జోగు రామన్న ,బాపూరావు, సేవాలాల్ జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షులు భీమ్రావు రాథోడ్, ఉట్నూర్ మాజీ జెడ్పిటిసి చారులత రాథోడ్, బంజారా సంఘం రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు, బంజారా ప్రజలు పాల్గొన్నట్లు ఆయన తెలిపారు.

Leave a Reply