MLA | 25వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్‌గా కంకటి ప్రణీత ప్రమాణ స్వీకారం

MLA | 25వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్‌గా కంకటి ప్రణీత ప్రమాణ స్వీకారం
MLA | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి మున్సిపాలిటీ 25వ వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికైన కంకటి ప్రణీత సోమవారం ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎన్నికల అధికారి, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ ఆమెతో పదవీ నిబద్ధతపై ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ప్రణీత మాట్లాడుతూ.. తన గెలుపుకు సహకరించిన 25వ వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటానని తెలిపారు.ముఖ్యంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ సంపూర్ణ సహకారంతో వార్డులో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
వార్డులో తాగునీరు, డ్రైనేజీ , అంతర్గత రహదారుల వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వినోద్ గారి మార్గదర్శకత్వంలో 25వ వార్డును అభివృద్ధి పథంలో ముందంజలో ఉంచుతానని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పేదవాడికి అందేలా నిరంతరం అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, వార్డు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రణీతకు శుభాకాంక్షలు తెలియజేశారు.
