గురుకుల విద్యార్థినుల అదృశ్యం

గురుకుల విద్యార్థినుల అదృశ్యం

దమ్మపేట, ఆంధ్రప్రభ : దమ్మపేట మండల పరిధిలోని అంకంపాలెం(Ankampalem) గిరిజన గురుకుల సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల హాస్టల్ నుండి ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమైన సంఘటన నిన్న‌ రాత్రి జ‌రిగింది. ఈ సంఘటనకు సంబంధించి దమ్మపేట ఎస్సై సాయి కిషోర్ రెడ్డి(Sai Kishore Reddy) తెలిపిన వివరాల ప్రకారం సత్తుపల్లి మండలం ఓ గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థినులు హాస్టల్ సిబ్బందికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా నిన్న ఉదయం బయటకు వెళ్లారు.

బయటకు వెళ్లిన విద్యార్థినులు రాత్రి వ‌ర‌కూ రాక‌పోవ‌డంతో వారి త‌ల్లిదండ్రుల‌కు కళాశాల ఇంగ్లీష్ లెక్చెరర్ బానోత్ హరిత(English Lecturer Banoth Haritha) సమాచారం ఇచ్చారు. చుట్టుపక్కల ప్రాంతాలు, గ్రామాలలో గాలించినప్పటికీ విద్యార్థినుల‌ ఆచూకీ లభ్యం కాకపోవటంతో లెక్చరర్ హరిత(Lecturer Haritha) దమ్మపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దమ్మపేట ఎస్సై సాయి కిషోర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply