గూడూరు, మే 2 (ఆంధ్రప్రభ) : మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండలం చిన్న ఎల్లాపూర్ గ్రామ శివారు లక్ష్మణ్ తండాకు చెందిన వాంకుడోత్ జాన్ పాల్ (6) తండ్రి కృష్ణమూర్తి భూపతిపేట చెరువులో శవమై తేలాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి.. బుధవారం సాయంత్రం ఆదివారంపేట తండాకు వెళ్లి ఆటోలో తిరిగి వస్తున్న క్రమంలో మార్గమధ్యలో ఆటోను ఆపి పడుకున్న బాలుడు తప్పిపోయాడని పోలీసులకు సమాచారమిచ్చారు.
గురువారం రోజంతా వెతికినా బాలుడి ఆచూకీ లభ్యం కాలేదు. శుక్రవారం భూపతిపేట సమీపంలో ఓ చెరువులో బాలుడి శవం ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో గూడూరు ఎస్సై సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాడీపై గాయాలు కనిపించడంతో ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందాడా? లేదా కొట్టి చంపారా? అనే అనుమానాలు గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.