ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తేజ సజ్జా (Teja Sajja) హీరోగా కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) దర్శకత్వంలో తెరకెక్కిన మిరాయ్ (Mirai) థియేటర్లలో దూసుకుపోతోంది. మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ (box office) వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రం మూడు రోజుల్లో వరల్డ్‌వైడ్ (Worldwide) రూ.81.20 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు తెలిసింది. తొలిరోజు రూ.27.2 కోట్లు రాగా, రెండో రోజు రూ.28.4 కోట్లు, మూడో రోజు 25.6 కోట్లు వచ్చాయి.
పీపుల్స్ మీడియా బ్యానర్ (People’s Media Banner) పై టీజీ విశ్వప్రసాద్, ఆయన కుమార్తె కృతి ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. యాక్షన్, అడ్వంచర్, ఫాంటసీ (Fantasy), డివోషనల్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రంలో రితికా నాయక్, శ్రియ, మంచు మనోజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

