Minister | ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించిన ఘనుడు పీవీ

Minister | ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించిన ఘనుడు పీవీ

  • మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి
  • పీవీకి ఘన నివాళులర్పించిన మంత్రి

Minister | మక్తల్, ఆంధ్రప్రభ : భారతదేశంలో ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించి, పరుగులు పెట్టించిన ఘనుడు దివంగత ప్రధానమంత్రి పీవీ నరసింహారావు అని రాష్ట్ర క్రీడా, పశుసంవర్ధక, యువజన సర్వీసులు, మత్స్యశాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి(Minister Dr. Vakiti Srihari) అన్నారు. భారతరత్న, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… బహుభాషా కోవిదుడు పీవీ ప్రధానిగా భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చారని గుర్తు చేశారు. దేశంలో ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించి, పరుగులు పెట్టించిన ఘనుడు పీవీ నరసింహారావు(PV Narasimha Rao) అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా, ముఖ్యమంత్రిగా, భారతదేశ ప్రధానమంత్రిగా ఆయన సేవలు శ్లాఘనీయమని మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి గారు కొనియాడారు.

ఆనాడు కేంద్రంలో సంఖ్యా బలం లేకున్నా.. పూర్తి కాలం ప్రభుత్వాన్ని(government) నడిపిన ఘనత ఆయనకే సొంతమ‌న్నారు. తమ ప్రజా ప్రభుత్వం పీవీ నరసింహారావు స్ఫూర్తితో పనిచేస్తుందన్నారు. ఆయన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి జి. లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్ట సురేష్ కుమార్ గుప్తా, బోయ రవికుమార్, బి.గణేష్ కుమార్, రాజేందర్, బోయ వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply