Minister Seetakka | కార్యకర్తలను ఆదుకుంటాం..

Minister Seetakka | కార్యకర్తలను ఆదుకుంటాం..

  • గిరిజన కుటుంబానికి ఆర్థిక సహాయం
  • సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాసిరెడ్డి సాంబశివరెడ్డి విరాళం

Minister Seetakka | ములుగు జిల్లా, మంగపేట, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని మంత్రి సీతక్క(Minister Sitakka) అండతో ఆపన్న సమయంలో వారికి అండగా ఉంటామని సీనియర్ కాంగ్రెస్ నాయకులు జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ మెంబర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు.

ములుగు జిల్లా మంగపేట మండలం అకినేపల్లి మల్లారం గ్రామంలో నిరుపేద గిరిజన కుటుంబానికి చెందిన నాగుల ఆదెమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతి చెందగా వారి కుటుంబం ఆర్థికంగా అవస్థలు పడుతున్న విషయాన్ని తెలుసుకున్న నాసిరెడ్డి సాంబశి వరెడ్డి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క గారి ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ గారి సూచన మేరకు శనివారం స్థానిక కాంగ్రెస్ నాయకులు దూలిపాల బాలకృష్ణతో కలిసి నాగుల ఆదెమ్మ ఇంటికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

అనంతరం ఆదెమ్మ దశదిన కార్యక్రమం ఖర్చుల నిమిత్తం వారి కుటుంబ సభ్యులకు రూ. ఐదు వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మంత్రి సీతక్క సహకారంతో బాధితురాలి కుమారుడు నాగుల రాంబాబు కి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా ఇంటి నిర్మానాన్ని సాంబశివరెడ్డి పరిశీలించారు. వారి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని సాంబశివరెడ్డి భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో నాగుల రాంబాబు, నాగేశ్వరరావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాసిరెడ్డి నాగిరెడ్డి, ములుగు మార్కెట్ కమిటీ డైరెక్టర్ లక్కీ వెంకన్న, కటుకూరు శేషయ్య, ధూళిపాల బాలకృష్ణ, తొండపు సంజీవరెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ మోహినుద్దీన్, చెట్టుపల్లి రాజు, రవి స్థానిక కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply