నేడు మోత్కూర్ కి మంత్రి సీతక్క రాక…

మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో ఈరోజు సాయంత్రం 5 గంటలకు పోతాయి గడ్డలోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించే కార్నర్ మీటింగ్ కు పంచాయతీరాజ్ శాఖ మంత్రి,భువనగిరి పార్లమెంటు మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి దళసరి సీతక్క ముఖ్యఅతిథిగా విచ్చేస్తున్నట్లు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండగొని రామచంద్రు తెలిపారు.తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ తో కలిసి ఎన్నికల ప్రచార ర్యాలీ, కార్నర్ మీటింగ్ లో మంత్రి సీతక్క పాల్గొననున్నారు.కార్నర్ మీటింగ్ కు సంబంధించి అంబేద్కర్ చౌరస్తాలో స్థలాన్ని జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఫైళ్ల సోమిరెడ్డి తో పాటు సీఐ వెంకటేశ్వర్లు ,ఎస్సై సతీష్ లు పరిశీలించారు.
శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం నుండి చెరువు కట్ట , పాత బస్టాండ్ మీదుగా పోతాయిగడ్డ వరకు ఎన్నికల ప్రచార ర్యాలీలో మంత్రి సీతక్క పాల్గొననున్నారు. 12 వార్డులకు సంబంధించిన కౌన్సిలర్ అభ్యర్థులు , ప్రజాప్రతినిధులు, మాజీ కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు , కో ఆప్షన్ సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు , యూత్ కాంగ్రెస్, ఎన్ ఎస్ యూ ఐ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని మంత్రి సీతక్క ఎన్నికల ప్రచార కార్నర్ మీటింగ్ ను విజయవంతం చేయాలని కోరారు.
