ఈ రోజు మంత్రి పొన్నం…
హైదరాబాద్ పొలిటికల్ బ్యూరో, ఆంధ్రప్రభ : రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఈ రోజు కరీంనగర్ లో పర్యటించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు కరీంనగర్ (Karimnagar) జిల్లా కేంద్రంలో మంత్రి సీతక్క, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ లతో కలిసి ఎల్ ఎండీ కాలనీలో పర్యటిస్తారు.
దుర్గాబాయి దేశ్ ముఖ్ మహిళా శిశు వికాస కేంద్రంలో బ్యూటీషియన్, జ్యూట్ బ్యాగ్ టైలరింగ్ , ఎలక్ట్రికల్ ఆటో డ్రైవింగ్ లో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్ లు ప్రదానం చేస్తారు. అనంతరం పోషణ మహా కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ రోజు సాయంత్రం 6:00 గంటలకు కరీంనగర్ మహాత్మా జ్యోతిరావు పూలే గ్రౌండ్ లో మంత్రి సీతక్క (Minister, Seethakka) తో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటారు..

