Minister Poetic Tag : పరాభవం కాదు Andhra Prabha News

Minister Poetic Tag : పరాభవం కాదు Andhra Prabha News

  • కూట‌మికి ప్రాభవం
  • మంత్రి కందుల ప‌ద‌ విన్యాసం
  • ఉగాది వేడుకల్లో క‌ళావైభ‌వం
  • 161 మందికి స‌త్కారం
  • క‌ళలు, సంస్కృతికి మళ్లీ పునర్జీవం

( ఆంధ్ర‌ప్ర‌భ‌, ఏపీ న్యూస్ నెట్ వ‌ర్క్)

Minister Poetic Tag

“పరాభవ” నామ సంవత్సరం అంటే అన్యాయం, అక్రమాలు, తప్పులు చేసే అక్ర‌మార్కుల‌కు పరాభవమని, మంచి,న్యాయం చేసే కూటమి ప్రభుత్వానికి ఇది “ప్రాభవ” (విజయ) సంవత్సరమని ఏపీ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి దుర్గేష్ అన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు గురువారం అత్యంత వైభవంగా జరిగాయి. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ఉత్సవాలను ప్రారంభించారు.

Minister Poetic Tag

దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును “తెలుగుకు వెలుగు తెస్తున్న నేత”గా అభివర్ణించారు. కళలకు సరైన ప్రోత్సాహం లభించినప్పుడే, క‌ళాకారుల‌కు బాసటగా నిలబడ్డప్పుడే అవి విరాజిల్లుతాయన్నారు. 2019-2024 గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన తెలుగు కళా, సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధర‌ణ‌కు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కవులు, కళాకారులు, రచయితలను గౌరవించడం ద్వారా సమాజంలో చైతన్యాన్ని నింపుతున్నామని ఆయన వివ‌రించారు.

Minister Poetic Tag : పున‌ర్జీజం కందుకూరి పుర‌స్కారం

Minister Poetic Tag

గతంలో నిలిపి వేసిన కందుకూరి పురస్కారాలు, ఉగాది పురస్కారాలను సీఎం ఆదేశాల మేరకు తిరిగి నిర్వహిస్తున్నామని స్ఫష్టం చేశారు. తెలుగు రాష్ట్రం, జాతి కోసం సమున్నతంగా కృషి చేసిన మహానుభావుల ఆశయాలు ముందుకు తీసుకెళ్లి భావితరాలకు స్ఫూర్తిని ఇస్తామ‌న్నారు.

Minister Poetic Tag

దశాబ్దాలుగా గుర్తింపున‌కు నోచుకోని కోనసీమ ప్రభల తీర్థాన్ని అధికారిక పండుగగా గుర్తించిన ఘనత సీఎం చంద్రబాబుదేనని గుర్తుచేశారు. నిరుద్యోగుల కోసం 10 వేల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం, దివ్యాంగులకు దివ్యాంగ శక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు.

Minister Poetic Tag : క‌ళాకారుల‌కు స‌త్కార వైభ‌వం

Minister Poetic Tag

ఉమ్మడి రాష్ట్రంలో, విభజిత రాష్ట్రంలో కళలు, సంస్కృతికి పెద్ద పీట వేసింది సీఎం చంద్రబాబునాయుడు అని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. పురస్కారాలు పొందిన ప్రతి ఒక్కరూ ఆంధ్రజాతికి మళ్లీ వెలుగులు వస్తున్నాయని అన్నట్లుగా చెప్పారు. ఇది ఒక ప్రత్యేకత ఉన్న ముఖ్యమంత్రి గొప్పదనం అని కొనియాడారు. మన చరిత్ర, సంస్కృతి, కళారీతులను పోషించుకోవాలని అప్పుడే ముందుకు వెళ్తామని నమ్మిన నాయకుడు సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. స‌మాజంలో వివిధ రంగాల్లో, వివిధ కళా రీతుల్లో అద్భుతంగా రాణిస్తూ లబ్ద ప్రతిష్టులుగా ఉన్న కవులు, కళాకారులు, రచయితలను మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా అభినందించారు.

Minister Poetic Tag

కళాకారులు సున్నిత మనస్కులు అని, రాగద్వేషాలు ఉండవని, మణులు, మాణిక్యాలు ఏమీ కోరుకోరని కేవలం చప్పట్లకు ఆనంద పడతారన్నారు. ఈ క్రమంలో అందరూ రాష్ట్రము అభివృద్ధి చెందాలని, కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్లేలా ఆశీర్వదించాలని కోరారు. మంచి మనసుతో, అమృత హస్తాలతో ఆశీర్వదిస్తే ఆనందదాయకంగా ఈ ఏడాది ముందుకు వెళ్తుందన్నారు.

Minister Poetic Tag

అనంతరం మంత్రి కందుల దుర్గేష్ సహచరులతో కలిసి ఉగాది పచ్చడిని స్వీకరించారు. ప్రముఖ సిద్ధాంతి మాడుగుల నాగఫణి శర్మ గారి పంచాంగ శ్రవణాన్ని ఆసక్తిగా ఆలకించారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన కళాకారులను, రచయితలను ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేకంగా అభినందించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కళాకారుఢ‌/, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు మంత్రి దుర్గేష్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్కృతి, సాహిత్యం, సంగీతం, నృత్యం, సామాజిక సేవ, జర్నలిజం, పెయింటింగ్, కళలు తదితర విభాగాల్లో కమిటీ ఎంపిక చేసిన 161 మందికి ఉగాది, కళారత్న(హంస) పురస్కారాలు ప్రదానం చేశారు.

ALSO READ : 38000 MT Gas Available : ఏపీలో గ్యాస్​ కొరత లేదు Andhra Prabha News

Leave a Reply