Minister | జగన్మాతను దర్శించుకున్న మంత్రి అనిత

Minister | జగన్మాతను దర్శించుకున్న మంత్రి అనిత

  • హోమంత్రికి ఘన స్వాగతం పలికిన ఈవో చైర్మన్…

Minister | ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కొలువై ఉన్న కనకదుర్గమ్మ వారిని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ఈ రోజు దర్శించుకున్నారు.

సరస్వతీ దేవి అలంకరణలో ఉన్న కనకదుర్గమ్మ దర్శనానికి విచ్చేసిన మంత్రి అనితకు దుర్గగుడి చైర్మన్ బొర్రా గాంధీ, ఈవో శీనా నాయకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. మంత్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఈవో చైర్మన్లు అమ్మవారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు వైదిక కమిటీ సభ్యులు ట్రస్ట్ బోర్డు సభ్యులు ఉన్నారు.

Minister |

Leave a Reply