తుడా చైర్మన్‌ను కలిసిన మంత్రి

తుడా చైర్మన్‌ను కలిసిన మంత్రి
అభివృద్ధి, రాజకీయ పరిణామాలపై చర్చ
తిరుపతి తుడా, నవంబర్ 3 (ఆంధ్రప్రభ): తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, టిటిడి ఎక్స్ అఫీషియో సభ్యులు, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డిని రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సోమవారం తుమ్మలగుంట నలందానగర్ లోని దివాకర్ రెడ్డి నివాసంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, టిడిపి పుంగనూరు నియోజకవర్గంలో ఇన్చార్జి చల్లా బాబు భేటీ అయ్యారు. సమావేశంలో స్థానిక అభివృద్ధి అంశాలు, రాజకీయ పరిణామాలు వంటి విషయాలపై చర్చించినట్లు సమాచారం. భేటీ స్నేహపూర్వక వాతావరణంలో జరగడంతో తుడా పరిధిలో జరుగుతున్న అభివృద్ధిపై రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తుడా చైర్మన్ ను ప్రశంసలతో ముంచెత్తారు. తిరుపతిలో జరిగిన మహిళా సాధికారత సదస్సును విజయవంతం చేయడంలో డాలర్స్ దివాకర్ రెడ్డి కృషిని మంత్రి ప్రశంసించారు. తిరుపతి రాజకీయ తదితర విషయాలు చర్చించుకున్నారు.ఈ కార్యక్రమంలో తిరుపతి రూరల్,రేణిగుంట మండల కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
