Minister | గతంలో ఎన్నడూ లేని విధంగా…
Minister | మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్ మండలంలోని గొలపల్లి గ్రామం నుండి బీఆర్ ఎస్ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు రాష్ట్ర క్రీడ, పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి(Minister Dr. Vakiti Srihari) సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వేల కోట్ల రూపాయలతో మక్తల్ నియోజకవర్గాన్ని మంత్రి శ్రీహరి అభివృద్ధి చేస్తున్నారని, ఈ అభివృద్ధిలో తాము పాలుపంచుకోవడానికి వాకిటి శ్రీహరికి అండగా నిలబడడానికి కాంగ్రెస్ పార్టీ(Congress Party)లో చేరుతున్నామని తెలిపారు.
మక్తల్లో మంత్రి నివాసంలో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. మండల కాంగ్రెస్ నాయకుడు సూర్య కుమార్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి.


