Minister Jupally | సోయా రైతులను కేంద్రం ఆదుకోవాలి

Minister Jupally | సోయా రైతులను కేంద్రం ఆదుకోవాలి

  • కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరిన‌ మంత్రి జూపల్లి..

Minister Jupally | ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో సోయాబీన్ రైతుల ఆందోళన దృష్ట్యా నాఫెడ్ ద్వారా తక్షణమే సోయాబీన్ కొనుగోళ్లు చేపట్టాలని రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇవాళ‌ నేరడిగొండ మార్కెట్ యార్డులో రైతుల సమస్యలు తెలుసుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి సమస్యను వివరించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నాఫెడ్ ద్వారా తక్షణమే కొనుగోలు చేపట్టి న్యాయం చేయాలన్నారు.

ఈసందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. అకాల వర్షాల వల్ల సోయాబీన్ పంట నాణ్యత దెబ్బతిన‌డంతో పాటు సోయాబీన్ రంగు మారిదంని, ఇది రైతులకు మరింత శాపంగా మారిందని వివరించారు. మార్కెట్ యార్డుల్లో రైతులు తమ పంటను విక్రయించేందుకు రోజుల పడి కాపులు కాస్తున్నారన్నారు. కొనుగోళ్లు నిలిచిపోవడంతో గ్రామాల్లోని రైతుల ఇళ్లలోనే సోయా నిల్వలు పేరుకుపోయాయి. కేంద్రం చొరవ తీసుకుంటేనే రైతులకు మద్దతు ధర దక్కుతుందని మంత్రి జూపల్లి పేర్కొన్నారు.

Minister Jupally

నేరడిగొండ మార్కెట్ యార్డులో ఆకస్మిక తనిఖీ..!
మంత్రి జూపల్లి కృష్ణారావు నేరడిగొండ మార్కెట్ యార్డును ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ పంట నిల్వతో వేచి ఉన్న రైతులతో నేరుగా మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రైతుల సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని వారికి హామీ ఇచ్చారు.

సోయాబీన్ కొనుగోళ్లలో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించాలని ఇప్పటికే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర వ్యవసాయ శాఖకు లేఖ రాశారని మంత్రి జూపల్లి ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, కేంద్రం కూడా సానుకూలంగా స్పందించి నాఫెడ్ ద్వారా కొనుగోళ్లు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Leave a Reply