మంత్రి గొట్టిపాటి ప్రత్యేక పూజలు

మంత్రి గొట్టిపాటి ప్రత్యేక పూజలు

కశింకోట, అనకాపల్లి, ఆంధ్రస్రభ : ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి గవరపాలెం(Anakapalli Gavarapalem)లో వెలిసిన శ్రీ నూకాంబిక తల్లిని బుధవారం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయానికి వచ్చిన ఆయనకు మాజీమంత్రి స్థానిక శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ, దేవస్థానం చైర్మన్ పీలా నాగశ్రీ(Peela Nagashree) (గొల్ల బాబు) ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, ఆయనను ఘనంగా సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని ప్రసాదాలు అందజేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా, పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్, మాడుగులు శాసనసభ్యులు బండారు సత్యనారాయణ మూర్తి, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్, రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్(Infrastructure Development) కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, ఆలయ సహా కమిషనర్ కే ఎల్ సుధారాణి, మాజీ శాసనమండలి సభ్యులు బుద్ధ నాగ జగదీష్, గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర, డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ(DCMS Chairman Kotni Balaji), ఆలయ ధర్మకర్తలు సూరే సతీష్, దాడి రవికుమార్, పొలిమేర స్వాతి, మారిశెట్టి శంకర్రావు, కాండ్రేగుల రాజారావు, మజ్జి జానకి, కొడుకుల శ్రీకాంత్, వడ్డాది మంగ, కోనేటి సూర్యలక్ష్మి, యర్రవరపు సంతోష్ కుమారి పాల్గొన్నారు.

Leave a Reply