Minister | అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

Minister | అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

  • సర్పంచ్ అభ్యర్థి సుజాత యజ్ఞేశ్వర్ రెడ్డి

Minister | ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఓటు వేసి ఆదరించి గెలిపిస్తే మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో గ్రామాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని ఊట్కూర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి డి.సుజాత యజ్ఞేశ్వర్ రెడ్డి అన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి(Minister Vakiti Srihari) సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు.

గురువారం ఊట్కూర్ మండల కేంద్రంలో తన మద్దతుదారులతో కలిసి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలు పరిష్కరించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు.

గత పాలకుల నిర్లక్ష్యం కార‌ణంగా గ్రామ అభివృద్ధి నోచుకోలేదని, సర్పంచ్‌గా ఆదరిస్తే గ్రామ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తాన‌ని అన్నారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించే బాధ్యత తీసుకుంటానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) చేపట్టిన సంక్షేమ పథకాలు నిరుపేదలకు వచ్చే విధంగా చూస్తానని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు.

గ్రామంలోని ప్రతి సమస్యను తెలుసుకున్న వ్యక్తిగా నన్ను ఆదరించి గెలిపిస్తే గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానని ఆయన అన్నారు.

గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన(eligible) ప్రతి ఒక్కరికి పారదర్శకంగా అందిస్తానని అన్నారు. ఆదరించి ఓటు వేసి గెలిపిస్తే గ్రామ రూపు రేఖలు మారుస్తూ డ్రైనేజీలు నిర్మిస్తానని అన్నారు. పార్టీలకతీతంగా 16 వార్డులు అభివృద్ధి చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షులు బాల్ రెడ్డి, మాజీ జెడ్పిటిసిలు సూర్య ప్రకాష్ రెడ్డి, మణెమ్మ, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు ఎల్కోటి నారాయణరెడ్డి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్, మైనార్టీ అధ్యక్షుడు జలాల్, పట్టణ అధ్యక్షులు లింగం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply