ఎర్ర‌గ‌డ్డ‌లో మంత్రి దామోద‌ర ప్ర‌చారం

ఎర్ర‌గ‌డ్డ‌లో మంత్రి దామోద‌ర ప్ర‌చారం

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : కాంగ్రెస్ కు సంక్షేమం.. అభివృద్ధి రెండు క‌ళ్లు అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహా (Damodar Raja Narasimha) అన్నారు. ఈ రోజు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి దామోదర కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎర్రగడ్డ డివిజన్ లో ఇంటింటి ప్రచారం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజ నర్సింహా ఇంటింటికి వెళ్లి ఓటర్లను ఆప్యాయంగా పలుకరిస్తూ కాంగ్రెస్ కు ఓటేసి గెలిపించాలని కోరారు. ప్రచారంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ అభ్యర్థి, యువకుడు నవీన్ యాదవ్‌కు ఓటు వేసి గెలిపించాలని మంత్రి దామోదర విజ్ఞప్తి చేశారు.

Leave a Reply