Telangana | మల్లన్న స్వామిని దర్శించుకున్న మంత్రి అడ్లూరి…

Telangana | మల్లన్న స్వామిని దర్శించుకున్న మంత్రి అడ్లూరి…
Telangana | ఎండపల్లి, ఆంధ్ర ప్రభ : ఎండపల్లి మండల కేంద్రంలోని శ్రీ శ్రీ శ్రీ పర్వతాల మల్లన్న స్వామి ఆలయాన్ని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman Kumar) శుక్రవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి దేవస్థాన కమిటీ సభ్యులు, పురోహితులు ఒగ్గు కళాకారులతో ఘన స్వాగతం పలికారు.
తరువాత స్వామివారిని దర్శించుకుని ప్రాంత ప్రజల అభివృద్ధి (Development), క్షేమం కోసం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను కూడా మంత్రి పరిశేలించి ఆలయానికి కావాల్సిన విధులను కేటాయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు…

ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ (Congress party) మండల అధ్యక్షులు తాటిపర్తి శైలేందర్ రెడ్డి, నాయకులు మద్దుల గోపాల్ రెడ్డి, ప్యాక్స్ చైర్మన్ గూడ రాంరెడ్డి మొహహమ్మద్ అభి, పొట్లపల్లి సత్యనారాయణ రావు, తోడేటి బాల్లింగ్ గౌడ్,కందికట్ల రాజేశం, మంతెన నర్సయ్య,మంతెన లక్ష్మణ్,దేవి రవీందర్,భూసరపు అశోక్ గౌడ్,నస్పూరి మల్లేష్ రఘు వర్ధన్,ముస్కు రాజేశ్వర్ రెడ్డి,తీపిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి,ప్రశాంత్,నరేష్ ఆలయ కమిటీ సభ్యులు, ఒగ్గు కళాకారులు,కాంగ్రెస్ కార్యకర్తలు,భక్తులు పాల్గొన్నారు.
