పుస్కర ఏర్పాట్లు చేయాలనీ బీజేపీ డిమాండ్..

పుస్కర ఏర్పాట్లు చేయాలనీ బీజేపీ డిమాండ్..

చెన్నూర్, ఆంధ్రప్రభ : వచ్చే సంవత్సరంమంచిర్యాల జిల్లా చెన్నూరులో జరగనున్న పుష్కరాల ఏర్పాట్లు ఇంత వరకు ప్రారంభం కాలేదని ఆవేదన వ్యక్తం చేసిన బిజెపి జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్. ఇవ్వాళ స్థానిక బీజేపీ కార్యాలయంలో స్థానిక నాయకుల తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వెంకటేశ్వర్ గౌడ్ మాటాడుతూ సాక్షాత్తు స్థానిక ఎమ్మెల్యే, కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్నా ఏర్పాట్లు మాత్రం జరగకపోవడం శోచనీయం అని ఆయన అన్నారు.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి వివేక్ వెంకటస్వామి పుష్కరాల ఏర్పాట్లు ప్రారంభించి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీజేపీ పార్టీ తరఫున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply