Minister | పరిస్థితులను చక్కదిద్దుతున్నాం

Minister | పరిస్థితులను చక్కదిద్దుతున్నాం

Minister | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పెట్రోల్, డీజిల్‌, ఏటీఎఫ్‌ సరఫరాలో ఎలాంటి కొరత లేదని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి అన్నారు. కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్ పురి ప్రసంగాన్ని విపక్షాలు అడ్డుకుంటున్నాయి. ఎప్‌స్టీన్‌.. ఎప్‌స్టీన్‌ అంటూ లోక్‌సభలో విపక్ష సభ్యుల నినాదాలు చేశారు. పరిస్థితులను చక్కదిద్దుతున్నామని మంత్రి తెలిపారు. ప్రధాని మోడీ చర్చల వల్ల పరిస్థితులు సర్దుకుంటున్నాయన్నారు.

పెట్రోల్, డీజిల్‌, ఏటీఎఫ్‌ సరఫరాలో ఎలాంటి కొరత లేదన్నారు. దేశీయ రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయన్న కేంద్రమంత్రి తెలిపారు. గృహవినియోగ సిలిండర్ల సరఫరాకు ఇబ్బందులు లేవన్నారు. 60శాతం ఎల్‌పీజీని మనం గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. దేశంలోని చమురు శుద్ధి కర్మాగారాలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయన్నారు. చమురు శుద్ధి కర్మాగారాలు వంద శాతానికి మించి సామర్థ్యంతో పనిచేస్తున్నాయన్నారు.

పెట్రోల్, డీజిల్, కిరోసిన్, ఏటీఎఫ్‌, ఇంధన చమురు కొరత లేదన్నారు. హర్మూజ్‌ ఇబ్బందుల దృష్ట్యా ప్రత్యామ్నాయ మార్గాల్లో సరఫరా చేయనున్నట్లు తెలిపారు. హర్మూజ్‌ యేతర ముడి చమురు సరఫరా 70శాతానికి పెరిగిందన్నారు. భారత దిగుమతుల వనరులు 27దేశాల నుంచి 40 దేశాలకు పెరిగాయని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి తెలిపారు.

Leave a Reply