Minister | బీఆర్ఎస్ పార్టీకి ఢిల్లీలో పనేంటి..?

Minister | బీఆర్ఎస్ పార్టీకి ఢిల్లీలో పనేంటి..?
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తెలంగాణ మంత్రుల ఢిల్లీ పర్యటనను బీఆర్ఎస్ విమర్శించడం పై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి భంగం కలగకుండా పరిపాలన చేస్తున్నామని.. బీఆర్ఎస్ లా ఫామ్ హౌస్ లో పడుకొని పాలన చేయలేదు అన్నారు. బీఆర్ఎస్ ప్రతిపక్ష బాధ్యతను ఏ విధంగా మర్చిపోయి విఫలమైందో ఎన్నికల్లో చూసాం. బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ.. దానికి ఢిల్లీలో కార్యాలయం ఎందుకు..? మహారాష్ట్రలో ఏం పని ఉందని వెళ్ళారు అని ప్రశ్నించారు. మా హెడ్ క్వార్టర్ ఢిల్లీ. అందుచేత ఢిల్లీకి 100 సార్లయినా వస్తాం. బీజేపీ నిధులు తేవడంలో రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న అంశాన్ని తెలంగాణ ప్రజలు గమనించారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ పై రేవంత్ రెడ్డి, పీసీసీ అధిష్టానంతో చర్చించి నిర్ణయం తీసుకుంటారు అని చెప్పారు.
