Minister | పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి, ఎమ్మెల్యే..!!

Minister | పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి, ఎమ్మెల్యే..!!

Minister | పల్నాడు ప్రతినిధి, ఆంధ్రప్రభ : మహశివరాత్రి పర్వదినాన పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా ఇన్ చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ జీ.వీ ఆంజనేయులు, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, ఐ.జి సర్వ శ్రేష్ట త్రిపాటి, జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా, జిల్లా జాయింట్ కలెక్టర్ సంజన సింహ, జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు దర్శించుకున్నారు. జిల్లా ఇన్ చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ త్రికోటేశ్వర స్వామి వారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను స్వామివారికి, గొల్లభామ అమ్మవారికి చీరను సారే ను సమర్పించారు.

కొండ కింద స్టాల్స్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్…!!

పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా ప్రభుత్వానికి సంబంధించిన పలు స్టాళ్ల వ్యాపారాలను, ప్రజా చైతన్య కార్యక్రమాలను ప్రారంభించారు. కొండ కింద ఉన్న డ్వాక్రా ఉత్పత్తుల ప్రదర్శన, లీగల్ మెట్రాలజీ, రోడ్డు సేఫ్టీ,(ఐ.ఎన్.పి.ఆర్) సమాచార అండ్ పౌరు సంబంధాల శాఖ (ఫోటోలు ) స్టాళ్లను డి.ఆర్.డి.ఏ పి.డి ఝాన్సీ రాణి, జిల్లా ఉన్నతాధికారులతో కలిసి ప్రారంభించారు.

Minister |

మహాశివరాత్రి సందర్భంగా త్రికోటేశ్వర స్వామి వారికి ఆదివారం పల్నాడు జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు, రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, కలెక్టర్ కృతిక శుక్ల, ఆర్డిఓ మధులత, ఆలయ ఈవో దాసరి చంద్రశేఖర రావు తదితరులు పట్టు వస్త్రాలను సమర్పించారు. వీరికి ఆలయ ప్రధాన పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఉదయం స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబుతో పాటు, శ్రీశే శ్రీ తికోటేశ్వర స్వామి వారికి జరిగిన మొదటి అభిషేక పూజలో జమిందార్ వంశస్థులు పాల్గొన్నారు.

Minister |

అమరావతి పోలవరం పూర్తి కావాలని స్వామివారిని వేడుకున్నాం….

రాష్ట్ర విద్యుత్ శాఖ, జిల్లా ఇన్ చార్జీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ…. అమరావతి, పోలవరం పూర్తి కావాలని స్వామి వారిని కోరుకున్నాం. రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలని వేడుకున్నాం. అందరికి మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నట్లు పేర్కొన్నారు.

Minister |

రాష్ట్ర హోం మంత్రి అనిత మాట్లాడుతూ…. రాష్ట్ర వ్యాప్తంగా మహా శివరాత్రి ప్రశాంతంగా జరుగుతుంది. వచ్చిన భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకుంటున్నారు. క్యూ లైన్లలో అన్ని ఏర్పాట్లు చేశాం. చీఫ్ విప్ ఆంజినేయులు మాట్లాడుతూ…. ఆన్ లైన్ టికెట్స్ కొని దర్శనం చేసుకున్నాను. టైం స్లాట్ ప్రకారం దర్శనాలు జరుగుతున్నాయి‌. ప్రవేటు వాహనాలు పైకి రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యే అరవింద్ బాబు మాట్లాడుతూ….. ఇప్పటికే నలభై నుండి ఎనభై వేల మంది దర్శనం చేసుకున్నారు. క్యూ లైన్లలో భక్తులకు త్రాగునీరు, మజ్జిగ అందిస్తున్నాం. స్వామి వారికి పట్టు వస్త్రాలు అందించటానికి మంత్రులు వచ్చారు‌.

Minister |

కొండపై భక్తులతో “ఎంపీ” మాటామంతి…

నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లవ్ శ్రీకృష్ణదేవరాయలు ఆదివారం క్రికెట్ ఈశ్వర స్వామి వారి సన్నిధిలో భక్తులతో మాటా మంతి కార్యక్రమం నిర్వహించారు. కొండపై ఏర్పాట్లు గురించి ఆయన భక్తులను అడిగి తెలుసుకున్నారు. క్యూ లైన్ లో ఉన్న భక్తులతో ఆయన కరచాలనం చేసి వారిని ఆనందపరిచారు. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని పరవశించిపోయారు.

Minister |

Leave a Reply