Mini conference | స్మార్ట్ సిటీపై… కలెక్టర్ విస్తృతస్థాయి సమావేశం

Mini conference | స్మార్ట్ సిటీపై… కలెక్టర్ విస్తృతస్థాయి సమావేశం

Mini conference | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, నగరాభివృద్ధి పనుల పురోగతిపై శనివారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో విస్తృత సమీక్షా సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. మున్సిపల్ కమిషనర్, ఇంజినీరింగ్ వింగ్, స్మార్ట్ సిటీ అధికారులు, పట్టణాభివృద్ధి విభాగ అధికారులు పాల్గొన్నారు.

స్మార్ట్ సిటీ పనులపై కలెక్టర్ దృష్టి

స్మార్ట్ సిటీ పనుల పురోగతి మరోసారి మందగించడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రోడ్ కారిడార్ అభివృద్ధి, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, వాటర్ సప్లై నెట్‌వర్క్, డ్రైనేజీ అప్‌గ్రేడేషన్ వంటి కీలక పనులు నిర్దేశిత లక్ష్యాలకు వెనుకబడి ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. పనులు నాణ్యతతో, సమయపాలనతో జరగాలి. ప్రజల డబ్బు ఖర్చవుతోంది కాబట్టి ఏ ఆలస్యం కూడా సమర్థనీయమైంది కాదు” అని అధికారులు గట్టిగా ఆదేశించినట్లు తెలిసింది.

నగరంలో ప్రజల ప్రధాన సమస్యలపై దృష్టి

సమావేశంలో కర్నూలు నగరమంతా పెరుగుతున్న మురుగు నిల్వలు, చెత్త సేకరణలో విరామాలు, పాతకాలం రోడ్ల మరమ్మతులు, వీధిదీపాల సమస్యలపై కూడా డా. సిరి వివరాలు తెలుసుకున్నారు. పౌరులు ప్రతిరోజూ ఎదుర్కొంటున్న చిన్న- చిన్న సమస్యలను అధికారులు ‘తరువాత చేస్తాం’.. అన్న ధోరణితో వదిలేయకుండా వెంటనే పరిష్కరించాలన్నారు. స్మార్ట్ సిటీ అంటే కేవలం పెద్ద పెద్ద ప్రాజెక్టులే కాదు. ప్రజలు నడిచే రోడ్డు, వెలిగే వీధిదీపం, వెళ్లే కాలువ అని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ నేరుగా రంగంలోకి దిగి విభాగాలను కదిలించడంతో పనుల్లో పునర్వేగం రావచ్చన్న ఆశ ప్రజల్లో ఉంది.

మొత్తానికి… కర్నూలు నగరం కాగితాలపై స్మార్ట్ సిటీ, నుంచి నిజమైన స్మార్ట్ సిటీగా మారాలంటే ఈ సమీక్షలో కలెక్టర్ ఇచ్చిన హెచ్చరికలు, ఆదేశాలు అమల్లోకి రావడం కీలకం. అధికారులు, కాంట్రాక్టర్లు వేగం పెంచితే నగరం అభివృద్ధి దిశగా తిరిగి వేగం పుంజుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

Leave a Reply