మైక్రో ఆర్టిస్ట్ జయకుమార్ ప్రతిభ
నర్సంపేట నవంబర్ 4 (ఆంధ్రప్రభ): పెన్సిల్ మొనపై దీపం తయారు చేసి నూనె పోసి వెలిగించి మైక్రో ఆర్టిస్ట్ జయకుమార్ అబ్బురపరిచారు. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన జాతీయ అవార్డు గ్రహీత మైక్రోఆర్టిస్ శ్రీరామోజు జయకుమార్ ఆరనీకు మా ఈ దీపం కార్తీకదీపం.. అంటూ కార్తీకపౌర్ణమిని పురస్కరించుకుని పెన్సిల్ (లెడ్) మొనను దీపపు ప్రమిదలా చెక్కి అందులో నూనెతో కూడిన వత్తిని వేసి వెలిగించాడు.
ఈ సందర్భంగా జయకుమార్ మాట్లాడుతూ చీకట్లను చీల్చుకుంటూ అందరి జీవితాల్లో వెలుగును నింపేదే కార్తీకదీపం అని పవిత్రమైన ఈ కార్తీక మాసంలో గుళ్ళు గోపురాలు సందర్షించే సమయంలో భక్తులు ఎలాంటి దుర్ఘటనలు జరుగకుండా సంయమనం పాటిస్తూ తమభక్తిని చాటుకోవాలని భక్తులకు జయకుమార్ విజ్ఞప్తి చేశాడు.

