MI vs RCB | టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియ‌న్స్

ముంబ‌యి | ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య నేడు రసవత్తర ఫైట్ ఉండనుంది. ముంబై సొంత మైదానంలోనే ఈ మ్యాచ్ జరుగుతుంది. ఎప్పటి వలే రాత్రి 7.30గంటల ప్రాంతంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం అవుతుంది.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ముంబై ఫీల్దింగ్ ఎంచుకుంది.. ముంబై వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో బుమ్రా రీ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమ‌య్యాడు. గాయంతో గత కొన్నాళ్లుగా ముంబైకి దూరంగా ఉన్న బుమ్రా తాజాగా జట్టులో చేరిపోయాడు. నేటి మ్యాచ్ కూడా ఆడనున్నాడు . ఇక ముంబై వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఇప్పటి వరకు 33 మ్యాచ్ లు జరిగాయి. దీనిలో బెంగళూరు 14 మ్యాచులు గెలిచింది. ముంబై ఇండియన్స్ 19 మ్యాచులు విజయం సాధించింది

తుది జట్లు:ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, రికెల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధిర్, మిచెల్ శాంట్నర్, దీపక్ ఛాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవ్‌దత్ పడిక్కళ్, రజత్ పటిదార్, లివింగ్‌స్టన్, జితేష్ శర్మ, కృనాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజెల్‌వుడ్, యశ్ దయాల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *