హైదరాబాద్, (ఆంధ్రప్రభ) : భారతదేశంలోని ప్రముఖ పాదరక్షల రి-టైలర్లలో ఒకటిగా, మెట్రో బ్రాండ్స్ ఇటీ-వల దాని రిజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన, అమ్మకానికి ఉన్న పాదరక్షలపై దాని రిజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్‌లను చట్టవిరుద్ధంగా ఉపయోగించడంపై కఠిన చర్యలను ప్రారంభించింది.
దీనిలో భాగంగా హైదరాబాద్‌లోని మెట్రో మిరాకిల్‌పై పెద్దఎత్తున దాడి చేసింది. బ్రాండ్, కస్టమర్‌ల ప్రయోజనాలను కాపాడటంలో భాగంగా కంపెనీ లీగల్ టీమ్ తీసుకున్న మరో చర్య ఇది.
ఈసందర్భంగా మెట్రో బ్రాండ్స్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ లీగల్ అండ్ కంపెనీ సెక్రటరీ దీపా సూద్ మాట్లాడుతూ… భారతదేశంలోని ప్రముఖ పాదరక్షల రిటైలర్లలో ఒకరిగా, మెట్రో బ్రాండ్స్ వద్ద తాము తమ బ్రాండ్ సమగ్రతకు, సంవత్సరాలుగా తమ కస్టమర్లతో తాము ఏర్పరచుకున్న నమ్మకానికి నష్టం నిరోధించడానికి కట్టుబడి ఉన్నామన్నారు.
నకిలీ వస్తువుల నుండి తమ కస్టమర్లను రక్షించడానికి తాము శ్రమిస్తున్నామన్నారు. తమ ట్రేడ్‌మార్క్‌లను దుర్వినియోగం చేయడానికి ప్రయత్నించే ఎలాంటి సంస్థపైన అయినా కఠినమైన చర్యలు తీసుకుంటూనే ఉంటామని జోడించారు.