వాట్సాప్ సేవలకు అంతరాయం ఏర్పడింది. భారతదేశంలోని పలువురు వినియోగదారులు వాట్సాప్ లో మెసేజ్ లు వెళ్లడం లేదని, స్టేటస్‌లు అప్‌లోడ్ కావడం లేదని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వేదికగా మెటాకు ఫిర్యాదు చేస్తున్నారు.
సిస్టమ్స్‌లోనూ వాట్సాప్ లాగిన్ కావడం లేదని పోస్టులు పెడుతున్నారు. ఈ ఉదయం UPI సేవలు నిలిచిపోయి, ఇప్పుడు వాట్సాప్ పనిచేయకపోవడంతో వినియోగదారులు అయోమయంలో పడ్డారు.