Mehreen Kaur Pirzada| పంజాబీ చిన్న‌ది.. భ‌ల్లే భ‌ల్లే..

Mehreen Kaur Pirzada| పంజాబీ చిన్న‌ది.. భ‌ల్లే భ‌ల్లే..

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : కృష్ణ‌ గాడి వీర ప్రేమ గాధ‌తో వెండి తెర‌కు ప‌రిచ‌య‌మైన హీరోయిన్ మెహ‌రీన్‌కు తొలి సినిమా తేడా కొట్టినా? కెరీర్ లో చెప్పుకో ద‌గ్గ స‌క్సెస్ లు చాలా ఉన్నాయి. మ‌హానుభావుడు, రాజా ది గ్రేట్తో బ్యాక్ టూ బ్యాక్ స‌క్స‌స్ లు అందుకుంది. మ‌ళ్లీ ఎఫ్ 2లో ఛాన్స్ కు బీజం వేసాయి. అందులో వ‌రుణ్ తేజ్ కు జోడీగా న‌టించి గ్రాండ్ విక్ట‌రీ అందుకుంది. ఇదే ఊపులో ఆరేడు సినిమాలు చేసింది. వాటిలో మంచి రోజులొచ్చాయి ఒక్క‌టే స‌క్సెస్ అయింది. ఆ వెంట‌నే ఎఫ్ 2కి సీక్వెల్ గా తెర‌కెక్కిన ఎఫ్ 3లోనూ ఛాన్స్ అందుకుంది. ఈసినిమా కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. అయితే ఈ విజ‌యం త‌ర్వాత మెహ‌రీన్ అనూహ్యంగా మాయ‌మైంది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ మ‌రో తెలుగు సినిమాలో క‌నిపించ‌లేదు. ఇటీవ‌ల ఎక్కువ స‌మ‌యం ప్ర‌యాణాల‌తో గ‌డుపుతున్నాన‌ని, ఫోటోలు తీసుకోవ‌డం, స‌ర‌దాగా గ‌డిపేయ‌డ‌మే త‌న జీవన విధానం అని మెహ్రీన్ చెప్ప‌క‌నే చెబుతోంది. ఈ భామ‌ తాజా ఫోటో క్లిక్స్ తో అభిమానుల‌ను అల‌రించేందుకు వ‌చ్చింది.

Leave a Reply