Megastar | చిరంజీవి ప్లాన్ అదిరింది..

Megastar | చిరంజీవి ప్లాన్ అదిరింది..

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : నాటి నుంచి నేటి వరకు.. 150కు పైగా సినిమాలు చేసి.. ప్రేక్షకులను అలరించి.. సెన్సేషన్ క్రియేట్(Create a sensation) చేసినా.. ఇంకా అదే ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్. అయితే.. ట్రెండ్ ను పట్టుకుని.. ఆ ట్రెండ్ కు తగ్గట్టుగా సినిమాలు చేస్తుంటారు. అలాగే.. ఆయన ఊహల్లో(In imagination) ఉండకుండా.. వాస్తవంలో ఉంటుంటారు. వాస్తవాన్ని గ్రహించి సినిమాలు చేస్తుంటారు కాబట్టే.. ఇంకా సక్సెస్ సాధిస్తున్నారు. అయితే.. ఈమధ్య కాలంలోఆయన సినిమాలు చూస్తుంటే.. మెగాస్టార్ ప్లాన్(Megastar Plan) అదిరింది అనిపించకమానదు. ఇంతకీ.. ఆయన ప్లాన్ ఏంటి..? అదిరింది అనిపించడానికి కారణం ఏంటి..?

Megastar | చిరు ఒక శక్తి..

Megastar

చిరంజీవి ఒక వ్యక్తిగా ఇండస్ట్రీలో ఎంట్రీ(Entry into the industry) ఇచ్చి.. ఒక శక్తిగా మారారు. పట్టుదల ఉంటే.. కానిది ఏదీ లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీలోకి రావచ్చు.. రాణించవచ్చు అని చేసి చూపించారు.. ఎందరికో ఆదర్శంగా నిలిచారు. అయితే.. టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు.. మారుతుంటుంది. అలాగే ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా అన్ని సినిమాలు ఆడాలి.. జనాలికి నచ్చాలి అని లేదు. కాలం మారే కొద్దీ కొత్త తరం నటులు వస్తుంటారు.. ప్రేక్షకుల అభిరుచుల్లో(In the interests of the audience) మార్పులు వస్తుంటాయి. ఆ కారణంగా స్టార్ హీరోల సినిమాలు సైతం బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడుతుంటాయి. అలా కాకుండా సక్సెస్ సాధించాలంటే.. కొత్తతరంతో.. తనతరం నటులతో కలిసి నటించాలి. అలా చేస్తే.. ఆడియన్స్ కి కొత్తగా ఉంటుంది.. సినిమాని ఎక్కువ మంది చూడడానికి.. తద్వారా సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్(More chance) ఉంటుంది. ఇది మెగాస్టార్ కనిపెట్టారు కాబట్టే.. తన సినిమాల్లో చూసి చూపిస్తున్నారు.

Megastar | అదే స్పీడు.. అదే గ్రేసు..

Megastar

ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్.. ఆ సినిమాలో అదే స్పీడు.. అదే జోరు.. అదే గ్రేసు చూపించారు. మళ్లీ ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేసి బ్లాక్ బస్టర్ సక్సెస్(Blockbuster success) సాధించారు. ఈ సినిమా తర్వాత నుంచి మెగాస్టార్ రూటు మార్చారు. తన సినిమాల్లో తన ఒక్కడే కనిపిస్తే చాలదు.. వేరే స్టార్ కూడా కనిపిస్తే.. ఆడియన్స్ బాగా ఎంటర్ టైన్ అవుతారు. మంచి విజయం సాధించడం ఈజీ అవుతుంది అనుకున్నారు. సైరా నరసింహారెడ్డి సినిమాలో.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్(Bollywood megastar Amitabh) తో కీలక పాత్ర చేయించారు. కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతితో ముఖ్యపాత్ర చేయించారు. సురేంద్రరెడ్డి డైరెక్షన్ లో రూపొందిన సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని స్వయంగా రామ్ చరణ్‌ నిర్మించారు. ఈ సినిమా తెలుగులో మంచి సక్సెస్ సాధించింది. ఉయ్యలవాడ నరసింహారెడ్డి పాత్ర పోషించిన మెగాస్టార్ కు మంచి పేరు తీసుకువచ్చింది.

Megastar | మరచిపోలేని ఆచార్య..

Megastar

మెగాస్టార్ చిరంజీవి.. కొరటాల శివ డైరెక్షన్( Direction Koratala Siva) లో నటించిన మూవీ ఆచార్య. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ తో కీలక పాత్ర చేయించారు. చిరు, చరణ్‌ కలిసి నటించిన సినిమా ఇది. అప్పటికి కొరటాల శివ.. తీసిన సినిమాలు అన్నీ సక్సెస్ సాధించాయి. అయితే.. ఈ సినిమా కథ జనాలకు కనెక్ట్ కాలేదు. పాత్రకు తగ్గట్టుగా సీన్స్ రాసుకోకుండా.. మెగాస్టార్ ఇమేజ్(Megastar image) దృష్టిలో పెట్టుకుని సీన్స్ రాసుకోవడం పెద్ద మైనస్. అందుకనే ఆచార్య ఆకట్టుకోలేకపోయింది.. బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచింది. కాకపోతే.. చిరు, చరణ్‌ ఇద్దరిన్నీ అలా తెర పై చూడడం మాత్రం అభిమానులకు(To the fans) నచ్చింది. ఈరకంగా మరిచిపోలేని చిత్రంగా నిలిచింది.

Megastar | సరికొత్త గాడ్ ఫాదర్..

Megastar

చిరంజీవి హీరోగా మోహన్ రాజా తెరకెక్కించిన సినిమా గాడ్ ఫాదర్(The Godfather of Cinema). ఇందులో నయనతార చిరుకు సిస్టర్ గా నటించారు. మలయాళంలో విజయం సాధించిన లూసీఫర్ మూవీకి రీమేక్ ఇది. ఈ సినిమాకి దర్శకులుగా వినాయక్, సుకుమార్, సుజిత్.. తదితర దర్శకుల్ని అనుకున్నప్పటికీ.. ఆఖరికి మోహన్ రాజా చేతిలో ఈ సినిమాని తెరకెక్కించే బాధ్యతను(Screening responsibility) పెట్టారు. ఇందులో విలన్ పాత్రను సత్యదేవ్ పోషించారు. సత్యదేవ్.. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూ.. మరో వైపు మంచి పాత్రలు వస్తే.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా రాణిస్తున్నాడు. ఇందులో డేరింగ్ అండ్ డాషింగ్(Daring and Dashing) డైరెక్టర్ పూరి జగన్నాథ్.. ముఖ్య పాత్ర పోషించడం విశేషం. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సక్సెస్ సాధించింది.

Megastar | తమ్ముడు రవితేజతో..

Megastar

మెగాస్టార్ చిరంజీవితో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాబీ(Successful Director Bobby) తెరకెక్కించిన సినిమా వాల్తేరు వీరయ్య. ఇందులో ఓ కీలక పాత్రను మాస్ మహారాజా రవితేజతో చేయించారు. చిరంజీవి, రవితేజ.. ఇద్దరూ కలిసి అన్నయ్య సినిమాలో నటించారు. ఆతర్వాత మళ్లీ ఈ సినిమాలో నటించి అలరించారు. 2023లో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించింది. చిరు అభిమానులు, రవితేజ అభిమానులకే కాదు.. మాస్ జనాలకు, సామాన్య ప్రేక్షకులకు(For general audience) వాల్తేరు వీరయ్య తెగ నచ్చేసింది. భోళా శంకర్ మూవీలో అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ తో ముఖ్యపాత్ర చేయించారు. ఈ సినిమా రీమేక్ కావడంతో నిరాశపరిచింది.

Megastar | చిరు, వెంకీ కలిస్తే..

Megastar

మన శంకర్ వరప్రసాద్ గారు మూవీలో వెంకటేష్ తో కీలక పాత్ర చేయిస్తున్నారు. ఇదేదో అలా వచ్చి ఇలా వెళ్లిపోయే క్యారెక్టర్ కాదు. 20 నిమిషాల పాటు వెంకీ ఈ సినిమాలో కనిపిస్తారు. వీరిద్దరి పై సాంగ్(A song about these two) కూడా ఉంది. ఆ సాంగ్ అయితే.. వేరే లెవల్లో ఉంటుందని టాక్ వినిపిస్తోంది. సంక్రాంతికి ఈ మూవీ వస్తుంది. ఈ సినిమా తర్వాత చిరు బాబీతో సినిమా చేయనున్నారు. ఈ సినిమాలో ఓ ముఖ్యపాత్ర కోసం తమిళ హీరో కార్తీ నటిస్తాడని ప్రచారం జరిగింది కానీ.. మలయాళ స్టార్ మోహన్ లాల్(Malayalam star Mohanlal) ని ఫైనల్ చేసారని ఇండస్ట్రీలో వినిపిస్తుంది.

Megastar

ఇలా మెగాస్టార్ తన సినిమాల్లో వేరే స్టార్ కూడా ఉండాలే చూసుకుంటున్నారు. ఇలా చేయడం వలన ఆడియన్స్ బాగా ఎంటర్ టైన్ అవుతారు. సినిమా సక్సెస్(The movie was a success) అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుందని.. మొత్తానికి మెగాస్టార్ ప్లాన్ అదిరిందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.. మరి.. ఈ ప్లాన్ తో మెగాస్టార్ మరిన్ని సినిమాలు చేసి.. వరుసగా సక్సెస్ సాధిస్తారేమో చూడాలి.

CLICK HERE TO READ MORE ఆ ముగ్గురు స్టార్స్ లో ఎవరితో..?

CLICK HERE TO READ MORE

Leave a Reply