Mega star | వినాయక్ సంచలన వ్యాఖ్యలు..

Mega star | వినాయక్ సంచలన వ్యాఖ్యలు..
Mega star | నంది అవార్డ్స్‌పై చిరంజీవి వ్యాఖ్యలు
వినాయక్ రియాక్షన్‌తో పెరిగిన వివాదం
వైరల్ అవుతున్న వినాయక్ కామెంట్స్
Mega star | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి, డైనమిక్ డైరెక్టర్ (Director) వినాయక్.. ఈ ఇద్దరి మద్య ఉన్న అనుబంధం గురించి తెలిసిందే. చిరంజీవిని వినాయక్ అన్నయ్యని పిలుస్తుంటారు. చిరంజీవి వినాయక్ ని సొంత తమ్ముడులా చూసుకుంటారు. ఇదిలా ఉంటే.. చిరంజీవిని ఎవరైనా తిడితే.. వాళ్లు పాడైపోతారు అంటూ వినాయక్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంతకీ ఏం జరిగింది..? ఎందుకు వినాయక్ అలా రియాక్ట్ అయ్యారు..?

Mega star | నంది అవార్డ్స్ మళ్లీ ఇవ్వాలి..
హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ గద్దర్ అవార్డ్స్ వేడుకలో మెగాస్టార్ (Megastar) చిరంజీవి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ నుంచి నంది అవార్డ్స్ ను మళ్లీ ప్రారంభించాలని.. ఇండస్ట్రీ జనాల్లో మళ్లీ ఉత్సాహం కలిగించాలి అన్నారు. అయితే.. చిరంజీవి మాటలను కొంత మంది మరో అర్ధం చేసుకుని.. విమర్శలు చేశారు. దీంతో చిరంజీవి కామెంట్స్ కాంట్రవర్శీగా మారింది. దీంతో మీడియాలో.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే.. దీని పై చిరంజీవి దీని పై రియాక్ట్ అవ్వలేదు.

Mega star | అది తప్పంటే ఎలా..?
ఇదిలా ఉంటే.. ఈ కాంట్రవర్శీ పై డైరెక్టర్ వినాయక్ (Vinayak) రియాక్ట్ అయ్యారు. చిరంజీవి మాట్లాడిన మాటల్లో అస్సలు తప్పు లేదు. ఆయన ఆయన గురించి నంది అవార్డులు ఇవ్వాలని కోరలేదు. ఆయనకు ఎన్నో అవార్డులు వచ్చాయి. ఇండస్ట్రీ గురించి అడిగారు.. ఇండస్ట్రీకి ప్రొత్సాకరంగా ఉంటుందని అడిగారు. అప్పట్లో నంది అవార్డ్స్ అంటే.. ఒక సెలబ్రేషన్.. ఉగాది నాడు అందరూ టీవీల ముందు కూర్చొని చూసేవారు ఆ వేడుకను. అలాంటి వేడుక మళ్లీ జరగాలి.. నంది అవార్డులు ఇవ్వాలని అన్నారు. అది కూడా తప్పంటే ఎలా..? ఆయన మాట్లాడిన దాంట్లో ఏమాత్రం తప్పలేదు అన్నారు వినాయక్.

Mega star | వైరలైన వినాయక్ కామెంట్స్..
చిరంజీవి మంచి మనిసి. ఆయన్ని ఎవరైనా ఏదైనా అంటే.. ఖచ్చితంగా పాడైపోతారు. ఇంకా చెప్పాలంటే.. ఆయన్ని కామంట్ చేసిన వారెవరు ఇప్పుడు లేరు. ఇండస్ట్రీలో లేరు. ఏదో రకంగా పాడైపోతారు. ఏదేమైనా ఆయన స్టేటస్ ఏంటి.? ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర నుంచి కానిస్టేబుల్ వరకు అందరూ ఆయన ఫ్యాన్స్. మెగాస్టార్ శక్తి నా లాంటి దగ్గరగా ఉన్న వారికి మాత్రం తెలుస్తుంది అని వినాయక్ చెప్పారు. ఇప్పుడు వినాయక్ మాటలు సోషల్ మీడియాలో (Social media) వైరల్ అయ్యాయి. మరి.. ఇంకెవరైనా రియాక్ట్ అవుతారేమో చూడాలి.

