Mega Hero | రూటు మార్చిన వరుణ్..

Mega Hero | రూటు మార్చిన వరుణ్..
మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్.. కెరీర్ స్టార్టింగ్ లో విభిన్న కథా చిత్రాలతో అలరించారు. వరుసగా సక్సెస్ సాధించి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నారు. ఈ మెగా హీరో కెరీర్ స్టార్ట్ చేసి కరెక్ట్ గా 11 ఏళ్లు అయ్యింది. అయితే.. ఈమధ్య కాలంలో.. బాగా వెనకబడ్డాడు. ఏ సినిమా చేసినా.. బాక్సాఫీస్ (Boxoffice) దగ్గర బోల్తాపడడం.. ఫ్లాప్ అవ్వడం జరుగుతుంది కానీ.. సక్సెస్ మాత్రం రావడం లేదు. మరి.. ఒకప్పుడు వరుసగా విజయాలు సాధించిన వరుణ్.. ఇప్పుడు వెనకబడడానికి కారణం ఏంటి..?

Mega Hero | వరుణ్ స్టైలే వేరు..
ఫస్ట్ సినిమాకి ఎవరైనా.. మాస్ మూవీ చేయాలి అనుకుంటారు. లేదా యూత్ ఫుల్ లవ్ స్టోరీ చేయాలి అనుకుంటారు కానీ.. వరుణ్ తేజ్ స్టైలే వేరు.. అందుకనే డిఫరెంట్ గా ఉండే విలేజ్ పొలిటికల్ మూవీ ముకుంద చేశారు. సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala) తెరకెక్కించిన ముకుంద సినిమా వరుణ్ తేజ్ తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అందించింది. ఆతర్వాత వరుణ్ నటించిన మూవీ కంచె. విభిన్న కథా చిత్రాల దర్శకుడు క్రిష్ ఈ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమా కమర్షియల్ గా విజయం సాధించడంతో పాటు మంచి పేరు తీసుకువచ్చింది. ముకుంద, కంచె సినిమాల్లో క్లాస్ హీరోగా నటిస్తే.. లోఫర్ మూవీలో మాస్ హీరోగా నటించారు. ఈ మూవీ కమర్షియల్ గా వర్కవుట్ కాకపోయినా.. నటుడుగా మాత్రం మంచి పేరు వచ్చింది.

Mega Hero | పవర్ స్టార్ టైటిల్ తో..
మిస్టర్ మూవీ నిరాశపరిచినా.. ఫిదా మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్ అందించింది. వరుణ్ తేజ్, సాయిపల్లవి జంటగా నటించిన ఈ సినిమాని శేఖర్ కమ్ముల తెరకెక్కించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమా తర్వాత వరుణ్ తొలిప్రేమ అంటూ పవర్ స్టార్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాతోనే వెంకీ అట్లూరి దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. అయితే.. అంతరిక్షం అంటూ చేసిన ప్రయోగం ఫలించలేదు.

Mega Hero | వరుణ్ కొత్త యాంగిల్..
ఎఫ్ 2 సినిమాలో సీనియర్ హీరో వెంకటేష్ తో కలిసి నటించారు వరుణ్ తేజ్. సక్సెస్ (Success) ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్ 2 మూవీని దిల్ రాజు నిర్మించారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఎఫ్ 2.. వరుణ్ లో ఉన్న కామెడీ యాంగిల్ ను బయటకు తీసింది. గద్దలకొండ గణేష్ అంటూ వైవిధ్యమైన పాత్రలో కనిపించి.. నెగిటీవ్ షేడ్ ఉన్న పాత్రల్లో కూడా రాణించగలడు అని నిరూపించారు. గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కించిన గద్దలకొండ గణేష్ కమర్షియల్ గా పెద్ద హిట్ గా నిలిచింది. ఇక ఎఫ్ 2 మూవీ సీక్వెల్ ఎఫ్ 3 కూడా అంచనాలకు తగ్గట్టుగా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది.

Mega Hero | కొత్త సంవత్సరం.. సరికొత్తగా..
హిట్టు, ప్లాపులతో కూల్ గా సాగుతున్న వరుణ్ (varun) కెరీర్ లో.. గని, గాంఢీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్, మట్కా అంటూ చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఏ సినిమా చేయాలి అనేది వరుణ్ తేజ్ కు ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ప్రస్తుతం మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో ఓ విభిన్న కథా చిత్రంలో నటిస్తున్నారు. ఈ కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారట. ఈసారి ఎలాగైనా సరే.. హిట్టు కొట్టాలనే కసితో ఈ సినిమా చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. కొత్త సంవత్సరంలో ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఒకప్పుడు వరుసగా సక్సెస్ సాధించిన వరుణ్.. సరైన కథ ఎంచుకోకపోవడంతో వరుసగా ఫ్లాపులు చూడాల్సి వచ్చింది. మరి.. కొత్త సంవత్సరంలో కొత్తగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వరుణ్ తేజ్ మళ్లీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.


