Meet | గిరిబాబు భుజం తట్టి ప్రోత్సహించిన కేటీఆర్

Meet | జూలూరుపాడు, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ పార్టీని వైరా నియోజకవర్గంలో బలోపేతం చేయడానికి కృషి చేయాలని ఆ పార్టీ యువ నాయకులు గిరిబాబు భుజం తట్టి కేటీఆర్ ప్రోత్సహించారు. బుధవారం ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సర్పంచుల ఆత్మీయ సన్మాన సభకు హాజరైన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ను వైరా నియోజకవర్గం బీఆర్ఎస్ నేత లకావత్ గిరిబాబు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుతో పాటు మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈసందర్భంగా కేటీఆర్ గిరిబాబుతో మాట్లాడుతూ… వైరా నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని అడిగే తెలుసుకున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల అన్నివర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుందన్నారు. రైతులు యూరియా కొరత కారణంగా ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ దృష్టికి గిరిబాబు తీసుకెళ్లారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలుస్తుందన్నారు.

సమస్యల పరిష్కారం కోసం బాధితులకు అండగా నిలుస్తున్నామని కేటీఆర్ కు గిరిబాబు వివరించారు. త్వరలో జరగబోయే మున్సిపాలిటీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ వైరా నియోజకవర్గంలో అత్యధిక స్థానాలు విజయం సాధిస్తుందని తెలిపారు. వైరా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలను ఐక్యతతో ముందుకు తీసుకెళ్లి బీఆర్ఎస్ పార్టీని వైరా నియోజకవర్గంలో పటిష్ట పరచాలని మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ యువ నేత గిరిబాబుకు సూచించారు.

Leave a Reply