Medical | అందరు సేవాభావంతో ముందుకు సాగాలి

Medical | అందరు సేవాభావంతో ముందుకు సాగాలి
Medical | తొర్రూరు, ఆంధ్రప్రభ : వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని గోపల గిరి సర్పంచ్ యనమాల సావిత్రి శ్రీనివాస్ కోరారు. అమెరికాలో ప్రముఖ వైద్య నిపుణులు(Medical professionals), ఎన్నారై డాక్టర్ రాజేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా మండలంలోని గోపాలగిరి గ్రామంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… డాక్టర్ రాజేందర్ రెడ్డి స్ఫూర్తితో సేవా భావంతో ముందుకు సాగినప్పుడే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ముందుగానే పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు. శిబిరంలో అర్హులైన రోగులకు కంటి, చెవి, ముక్కు, గొంతు(eye, ear, nose, throat) పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచిత మందులు పంపిణీ చేశారు.
తీవ్ర సమస్యలున్న వారికి మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రులకు రిఫర్ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు ప్రేమ్ కుమార్, సందీప్, నేత్ర వైద్య సహాయకులు మహేష్, అధ్యక్షుడు లక్షణ్, మహేష్, విజయ, యాకయ్య, ఉప్పలమ్మ లక్ష్మిప్రసన్న కుమార్, సట్ల నాగలక్ష్మి, జ్యోతి, ధర్మారపు కిరణ్, మహబూబ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి పూర్ణచందర్, రమేష్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొనారు.
