Medical | 60 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Medical | 60 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
Medical | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లాలోని యూపీహెచ్సీ, పీహెచ్సీల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో 60 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి యుగంధర్ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసేందుకు డిసెంబరు 31వ తేదీ 5గంటల వరకు గడువు ఉన్నట్లు చెప్పారు. యూపీహెచ్సీల్లో గ్రేడ్-2 ఫార్మసిస్ట్ పోస్టు 1, గ్రేడ్-2 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 2, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు 4, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ పోస్టులు 10, పీహెచ్సీల్లో గ్రేడ్-2 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 12, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ 16, శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ పోస్టులు 10 భర్తీ చేస్తామని పేర్కొన్నారు. నోటిఫికేషన్ వివరాలను https:///krishna.ap.gov.in వెబ్సైట్లో ఉంచామని, దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకుని నోటిఫికేషన్లో పేర్కొన్న ధ్రువపత్రాలను సమర్పించాలని కోరారు.
